NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు…

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని హుస్సేనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు అన్వర్ భాషా అధ్యక్షతన ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశం చాలా ఘనంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమం నందు ఉమ్మడి కర్నూలు జిల్లా డిసిఎంసీ చైర్మన్  మరియు పూర్వ విద్యార్థుల సంఘం గౌరవాధ్యక్షులైన వై నాగేశ్వరరావు యాదవ్ , ప్రగతిశీల గాయకులు మరియు  సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైన లెనిన్ బాబు, ఎచ్ఓఎస్ఎ వ్యవస్థాపకులు అయిన న్యాయవాది నాగభూషణం రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకుంటూ, పెద్దలను గౌరవిస్తూ, ప్రకృతిని సంరక్షిస్తూ అభివృద్ధి పథంలో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమం నందు గత సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను  1981, 1982 బ్యాచ్ పదవ తరగతి  విద్యార్థులు సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎచ్ఓఎస్ఎ సభ్యులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు,ఎస్ఎంసి చైర్మన్ రవి ,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

About Author