PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యంగ్ టైగర్‌‌ ఎన్టీఆర్‌‌ చేతుల మీదుగా.. ట్రైలర్ టాక్

1 min read

సినిమా డెస్క్ : ఈ మధ్య కాలంలో యంగ్‌ హీరోల్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు సత్యదేవ్‌దే. అటు వెండితెరపై ఇటు వెబ్‌ సిరీస్‌ల్లో కూడా తన సత్తా చూపెడుతున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం తను నటిస్తున్న తాజా చిత్రం ‘తిమ్మరుసు’ అసైన్మెంట్ వాలి అనేది దీనికి ట్యాగ్‌లైన్‌. – ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడలో ‘కిర్రాక్ పార్టీ’ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు రీసెంట్‌గా పూర్తవగా, విడుదలకు సిద్దం అయింది. జూలై 30న థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్‌‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

About Author