అధిక జనాభా దేశానికి అవరోధం
1 min read
చిన్న కుటుంబం- చింతలేని కుటుంబం
పిహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి
చెన్నూరు , న్యూస్ నేడు: అధిక జనాభా పెరుగుదల ద్వారా దేశ ప్రగతికి అవరోధం కలగడమే కాకుండా ప్రజలు ఎన్నో సవాళ్లను, ఆర్థిక ఇబ్బందులను, ఎదుర్కోవడం జరుగుతుందని అధిక జనాభా వల్ల అవరోధాలు తప్ప, ఆశించిన ఫలితాలు దక్కవని పి హెచ్ సి వైద్యాధికారులు డాక్టర్ సాయి చందన, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్ ,డాక్టర్ రాజశేఖర్ లు అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని పి హెచ్ సి నుండి గ్రామంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ, అధిక జనాభా వల్ల ఆర్థిక ఇబ్బందులే కాకుండా ఎన్నో అనార్థాలను, ఎన్నో సవాలను, ఎన్నో ఇబ్బందులను అనుభవించాల్సి వస్తుందని అధిక జనాభా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని పాటించాలని, చిన్న కుటుంబ చింతలేని కుటుంబం అంటూ వారు నినాదాలు చేశారు. అధిక జనాభా వల్ల అనర్థాలు తప్ప, ఆర్థిక వనరులు ఉండవని వారు తెలియజేశారు. అమ్మాయి వివాహ వయసు 18 సంవత్సరాలు అబ్బాయి వివాహ వయసు 21 సంవత్సరాలు ఉండాలని అలా కాకుండా చిన్న వయసులోనే వివాహాలు చేయవద్దని వారు ర్యాలీ ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ప్రణాళిక బద్ద మైన మాతృత్వం కోసం గర్భధారణల దారుణల మధ్య ఆరోగ్యకరమైన సమయం అంతరం ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన కలిగి ఉండాలని, ప్రజలు జనాభా నియంత్రణ పాటించాలని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం చెన్నూరు పాత బస్టాండ్ నందు మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పాల్గొన్నారు.