NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మధ్యాహ్న భోజనం’.. ఏజెన్సీని రద్దు చేయండి

1 min read

కలెక్టర్​ కు ఫిర్యాదు చేసిన ఎంవిఎన్ రాజు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ నెంబర్

కర్నూలు, న్యూస్​ నేడు:పేద మధ్య తరగతి విద్యార్థులకు సన్న బియ్యంతో వండిన అన్నం పెట్టాలని, అప్పుడే విద్యార్థులు ఆరోగ్యం బాగా ఉండటంతో పాటు చదువులోనూ రాణిస్తారన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తోందని, కానీ కొన్ని పాఠశాలలో దొడ్డు బియ్యంతో వండుతున్నారని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ మెంబర్  ఎంవిఎన్​ రాజు  ఆరోపించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పేటీఎం 2.0లో భాగంగా కర్నూలు  బికాంప్ లోని సిల్వర్ జూబ్లీ క్యాంపస్ నందు బాలబాలికల స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. సమావేశం అయిన తరువాత పిల్లల తల్లిదండ్రులకు ఏజెన్సీ వారు సన్న బియ్యంతో వండిన భోజనం కాకుండా లావు బియ్యంతో వండిన అన్నం, నీళ్ల చారు, ఉడికీ ఉడకని గుడ్డు పెట్టారని, దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాజు యాదవ్​  కలెక్టర్​ పి. రంజిత్​ బాషా దృష్టికి తీసుకొచ్చారు.  ఈ ఏజెన్సీ వారు  నాలుగు చోట్ల  వంటలు వండడం జరుగుతోందని, వారి  ఏజెన్సీని రద్దు చేయాలని కలెక్టర్​ ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంవి ఎన్​ రాజు తోపాటు మాలతి పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author