కోవెలకుంట్ల పాండురంగ స్వామి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలోని వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డినేడు కోవెలకుంట్ల పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది, నిర్వాహకులు.ఆ తరువాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా జరిగే పాండురంగ విఠలేశ్వర స్వామి రథోత్సవం వేడుకల్లో పాల్గొన్న మంత్రి. రంగ రంగ వైభవంగా జరిగిన పాండురంగ స్వామి రథోత్సవం కార్యక్రమంలో భక్తులు, కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పాలుపంచుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.