NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్పొరేట‌ర్ గా కూడ గెల‌వ‌లేడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పవన్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్ లో బయటికి వచ్చాడు. ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్ కళ్యాణే. చిరంజీవికి అధికారం రాలేదని.. ఆయన్ని పక్కకి పెట్టింది పవనే. ప్రజారాజ్యానికి 18 సీట్లు వచ్చాయని అసలు పార్టీలో కనపడకుండా పోయాడు. నాడు ప్రజారాజ్యం ను విలీనం చేయవద్దని పవన్‌ ఎందుకు చెప్పలేకపోయాడు?. అసలు ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారణమే పవన్ కళ్యాణ్. మేం పిలుస్తున్నా పవనే రావడం లేదని స్వయంగా నాగబాబు.. మెగా అభిమానుల మధ్య చెప్పాడు.. చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడున్నాడు?. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ, పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌గా కూడా గెలవలేడు అని వెల్లంపల్లి జోస్యం చెప్పారు.

                                      

About Author