జగన్ కు కొత్తపేరు పెట్టిన పవన్ కళ్యాణ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఎవెంజర్స్ సినిమాలో విలన్ అయిన.. తానోస్ తో సీఎంను పోల్చారు. తనను దత్తపుత్రుడు అని ఆరోపించే జగన్ కు తానోస్ అని పేరుపెడుతున్నాను అన్నారు. ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జపాన్ లో మద్యం పోటీలు పెట్టినట్లు పెడుతారని ఆరోపించారు. వైసీపీ పార్టీని ఓడించడమే తప తొలి అజెండా అన్నారు. అలాగే ఎవరైనా జనసేన పార్టీలోకి రావాలి అంటే..? ముందుగా జనసేన కార్యకర్తలను గౌరవించాలి అన్నారు. రాయలసీమ చదువుల సీమ అయితే.. దానిని ఫ్యాక్షన్ సీమగా ప్రచారం చేస్తున్నారంటు మండిపడ్డారు. ఎన్నో గ్రంథాలయాలకు నెలవు రాయలసీమ అని.. అల్లసాని పెద్దన్న వంటి మహనీయులు పుట్టిన గడ్డ ఇది డబ్బు అహంకారంతో విర్రవీగితే మడిచి ఎక్కడైనా పెట్టుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.