PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌వ‌న్ కళ్యాణ్ .. మీకు తిరుగులేదు దేవ‌ర !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. తాజాగా షెడ్యూల్‌ కోసం పవన్‌ సెట్‌లో అడుగుపెట్టారు. చారిత్రక కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో యాక్షన్‌ సీన్స్‌ కోసం పవన్‌ రిహార్సెల్‌ చేస్తున్నారు. ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ టోడర్‌ లాజరోవ్‌తో కలిసి కొన్ని పోరాట సన్నివేశాలు ప్రాక్టీస్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఆ ఫొటోలను బండ్ల గణేశ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసి ‘‘గన్ను పట్టినా, పెన్ను పట్టినా, కత్తి పట్టినా, మైకు పట్టినా.. ఏది పట్టినా ఎవరిపై గురి పెట్టినా మీకు తిరుగులేదు దేవర’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం బండ్ల చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

                                 

About Author