సకాలంలో ఇంటి పన్ను చెల్లించండి.. పంచాయతీ అధికారి పిలుపు
1 min read

హోళగుందన్యూస్ నేడు: ప్రజలందరూతమ ఇంటి పన్నును సకాలంలో చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని సంబంధిత పంచాయతీ అధికారులు విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగడానికి పన్నుల వసూళ్లు ముఖ్యమైనవని వారు తెలిపారు.మంగళవారం నిర్వహించిన సమావేశంలో అధికారులు రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు వంటి కనీస సౌకర్యాల మెరుగుదలకు పన్నులు కీలకమని వివరించారు. బకాయిలు ఉన్నవారు గడువులోగా చెల్లించి అపరాధ రుసుము నుంచి తప్పించుకోవాలని సూచించారు.ఇంటి పన్ను చెల్లించడం ప్రతి పౌరుని బాధ్యత అని, గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రజలు సహకరిస్తే గ్రామం మరింత అభివృద్ధి దిశగా సాగుతుందని పేర్కొన్నారు.అంతేకాకుండా, పన్నులు సకాలంలో చెల్లించిన వారికి రశీదులు అందజేస్తూ పారదర్శకతను పాటిస్తున్నామని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.

