PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెద్దిరెడ్డి సీఎం కాలేద‌న్న ఫ్ర‌స్టేష‌న్ లో ఉన్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌ంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టీడీపీ నేత న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి సీఎం కాలేదన్న ప్రెస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని టీడీపీ నేత కిషోర్‌కుమార్‌ దుయ్యబట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డి సీఎం కావాలని కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్‌లో వైఎస్ సహా అందరు సీఎంలతో గొడవ పడ్డారని తెలిపారు. వైసీపీలో సీఎం కాలేనని పెద్దిరెడ్డికి అర్థమైందని చెప్పారు. కోట్ల అవినీతికి పాల్పడ్డ పెద్దిరెడ్డికి కన్నుమిన్ను కానడం లేదని కిషోర్‌కుమార్‌ మండిపడ్డారు.

                                         

About Author