డ్రంకెన్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ లో పట్టుబడిన వారికి జరిమానా
1 min read
పల్లెవెలుగు కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా కర్నూలు మూడవ పట్టణ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించారు . పట్టుబడిన మొత్తం 16 మంది పై కేసులు నమోదు చేశారు. కర్నూలు జెఎఫ్సిఎం కోర్టులో హజరు పరచారు. వీరందరికి జరిమానాలు విధించారు . డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 6 మంది కి ఒక్కొక్కరి పై రూ. 3 వేల చొప్పున జరిమానా విధించారు. ఒపెన్ డ్రింకింగ్ లో పట్టుబడ్డ 10 మంది కి ఒక్కొక్కరి పై రూ. 1000/- జరిమానా విధించారు.