ప్రజలు సుఖ, సంతోషాలతో జీవించాలి…
1 min read
నూకాలమ్మ అమ్మవారి జాతరలో పాల్గొన్న ఎంపీ మహేష్ కుమార్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ప్రజలు సుఖ, సంతోషాలతో జీవించేలా ఎల్లప్పుడు ఆశీస్సులు అందించాలని శ్రీ నూకాలమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు 46వ డివిజన్ పరిధిలోని కొత్తపేట శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న జాతర మహోత్సవంలో శనివారం ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఎంపీ మహేష్ కుమార్ కు మంగళ వాయిద్యాలు, డప్పుల చప్పుళ్ళతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కూటమి నాయకులతో కలిసి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ నిర్వాహకులను ఎంపీ మహేష్ కుమార్ అభినందించారు. ఆలయ అభివృద్ధి విషయంలో తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో బీసీ నాయకులు ఘంటా ప్రసాదరావు, కూటమి నాయకులు,ఆలయ కమిటీ సభ్యులు,నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
