NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు వడదెబ్బపై అవగాహన..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మంగళవారం దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని గద్దెరాళ్ళ గ్రామములో సంచార చికిత్స కార్యక్రమాన్ని సంచార చికిత్స కార్యక్రమ అధికారి డాక్టర్,రఘు  ఆకస్మికంగా తనిఖీ చేశారు,అనంతరం మాట్లాడుతూ ప్రజలకు వడదెబ్బపై అవగాహనకల్పించిన్నారు. .జింక్ ఓ‌ఆర్‌ఎస్ ప్యాకెట్టులు అందుబాటులో ఉంచుకోవాలని.వేసవిలో  ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహనా కల్పించాలని సిబ్బందికి సూచించినారు, వడదెబ్బకు గురైనప్పుడు చెమట పట్టకపోవడం,శరీర ఉష్ణోగ్రత పెరగడము,వణుకు పుట్టడ ము,మగత నిద్ర లేదా కలవరింతలు,ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారకస్థితి,నీరసం,తలనొప్పి,వాంతులు, విరేచనాలు,మూత్రం పసుపు వర్ణంలో ఉంటుంది,కండరాలు పట్టివేయడము,స్పృహ కోల్పోవడము  లాంటి లక్షణాలు ఉంటాయని వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి,చల్లటి నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి,చల్లని గాలి తగలేలా చూసుకోవాలి,ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓ‌ఆర్‌ఎస్ ద్రవనము త్రాపించాలి ,వడదెబ్బ తగిలి అపస్మారక పరిస్థితిలో ఉన్న రోగికి నీరు త్రాగించకూడదు,వీలయినంత త్వరగా  ప్రథమ చికిత్సకు సమీపంలోని ప్రభుత్వ   ఆసుపత్రికి తరలించాలి,ఎoడవేళ ఇంటిపట్టూనే ఉండాలి,బయటికి వెళ్లవలసి వస్తే  తలపై టోపీ ధరించాలి,చేతి రుమాలు నెత్తికి కట్టుకోవాలి,  మధ్యనమ్ 12 నుంచి 3 గంటల మధ్యలో ఎoడలో తిరగరాదు అని తెలిపినారు, ఈకార్యక్రమంలో వైద్యులు డాక్టర్. కళ్యాణ్ , సామజిక ఆరోగ్య అధికారి గంగాధర్, ఆరోగ్య కార్యకర్త శివమ్మ, ఆశా కార్యకర్త అరుణ మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *