NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టికెట్ రేట్ పెంచుకునేందుకు `ఆర్ఆర్ఆర్` కు అనుమతి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎట్ట‌కేల‌కు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. జీఎస్టీ, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికాలు కాకుండా రూ.336 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఫైల్‌ను పరిశీలించిన ప్రభుత్వం టికెట్‌ రేట్ల్లు పెంచుకోవడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భారీ బడ్జెట్‌ కావడంతో విడుదలైన రోజు నుంచి పది రోజులు టికెట్‌ రేటు పెంచుకోవడానికి అనుమతి లభించింది. టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెమ్యునరేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్న సంగతి తెలిసిందే. జీవో మేరకు మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని తెలిపారు.

                                           

About Author