NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌ర్స‌న‌ల్ గా మాట్లాడితే.. అనుమానం రాకుండా ఎలా ఉంటుంది ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జ‌గ‌న్ తో భేటీ నేప‌థ్యంలో.. వైసీపీ చిరంజీవికి రాజ్య‌స‌భ ఆఫ‌ర్ చేస్తోంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వీటికి చిరంజీవి వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న‌కు రాజ‌కీయాల‌పై ఎలాంటి ఆస‌క్తి లేద‌ని తెలిపారు. దీని పై సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ స్పందించారు. సినీ ఇండస్ట్రీలోని అసోసియేషన్స్‌ని కలుపుకుపోకుండా.. ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద విజయవాడ వచ్చి ముఖ్యమంత్రితో పర్సనల్‌గా వన్ టు వన్ మాట్లాడితే.. ఇటువంటి అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి ? ’’ అని మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నించారు . ఇండస్ట్రీలో కొన్ని అసోషియేషన్లు ఉన్నాయి. వాటితో సంబంధం లేకుండా ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రిని పర్సనల్‌గా వన్ టు వన్ కలిశారు. ఒక టీమ్‌తో ఆయన రాలేదు. మీరు అక్కడ ఏం మాట్లాడారో మాకు ఎలా తెలుస్తుంది? అందుకే ఇటువంటి వివాదం వచ్చింది. నిజంగా సినిమా ఇండస్ట్రీ సమస్య అయితే.. అసోషియేషన్స్‌తో వచ్చి మాట్లాడాలి. లేకపోతే మీ వ్యక్తిగత సమస్యలు మాట్లాడుకోవచ్చు. వచ్చింది ఒక్కడే అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ల్యాండ్ కావాలా? రాజ్యసభ సీటు కావాలా? వంటి అనుమానాలు సహజంగానే వస్తాయి“ అని నారాయ‌ణ అన్నారు.

                                     

About Author