శబరిమలలో అయ్యప్ప మకర జ్యోతి దర్శనం
1 min read

పల్లెవెలుగువెబ్ : శబరిమలలోని పొన్నాంబలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. భక్తుల నామస్మరణతో శబరగిరులు మార్మోగుతున్నాయి. మకర జ్యోతిని దర్శించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అన్న శరణు ఘోషతో కొండ ప్రాంతం మార్మొగుతుంది. కోవిడ్ నేపథ్యంలో.. కరోనా నిబంధలను పాటిస్తూ భక్తులకు ఆలయ కమిటీ దర్శనం కల్పించింది. ఈనెల 20న తిరిగి ఆలయం మూసివేయనున్నారు.

