పెట్రోల్ ధరలు తగ్గనున్నాయి.. ఎందుకంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఫలితంగా సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా సరిపడా సరఫరా లేకపోవడంతో ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. అయితే ఒపెక్ దేశాల సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అందుబాటులోకి రానున్నాయన్న ఆశ మొదలైంది. కోవిడ్–19 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తి ఉన్నప్పటికీ ప్రయాణ, రవాణా, ఇంధనం విభాగాల్లో డిమాండ్ కొనసాగుతున్నట్లు భావిస్తున్నట్లు 23 సభ్యదేశాల ఒపెక్, అనుబంధ దేశాలు పేర్కొన్నాయి. మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో జరిగిన ఉత్పత్తి కోతలను నెమ్మదిగా పునరుద్ధరించడానికి ఉద్దేశించిన రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఫిబ్రవరిలో రోజుకు 400,000 బారెల్స్ ఉత్పత్తిని పెంచనున్నట్లు పేర్కొంది. ఉత్పత్తి పెరిగితే అధికంగా వినియోగించే భారత్ లాంటి దేశాల్లో ధరలు అందుబాటలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.