జనసైనికులకు పవన్ కీలక సూచనలు
1 min read
పల్లెవెలుగువెబ్ : జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళగిరి మండలం ఇప్పటంలో సభ నిర్వహణకు జనసైనికులు సర్వం సిద్ధం చేశారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో దామోదరం సంజీవయ్య సాక్షిగా సభా వేదిక పై ప్రసంగిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర క్షేమాన్ని కోరుకునే ప్రతిఒక్కరూ సభకు రావాలని పవన్ పిలుపు నిచ్చారు. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చాలా జాగ్రత్తలు తీసుకుని సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ సభ ద్వారా దిశానిర్దేశం చేయబోతున్నట్లు పవన్ తెలిపారు. రెండున్నరేళ్లలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలపై సభలో ప్రసంగించనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.