NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోడి వ్యర్ధాలు అక్రమ రవాణాపై జల్లెడ పడుతున్న  పోలీసులు

1 min read

కోడి వ్యర్ధాలు కలిగి ఉన్న లారీ, కోడి వ్యర్ధాలు సీజ్

వాహన డ్రైవర్,యజమాని, చాపల చెరువు యజమానిపై కేసు నమోదు

ఏలూరుజిల్లా ప్రతినిధి  న్యూస్​ నేడు : నూజివీడు డిఎస్పి కె వి వి ఎన్ వి ప్రసాద్, పెదవేగి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు వారి యొక్క ఆదేశాలపై పెదపాడు ఎస్ఐ కట్టా శారదా సతీష్  పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందితో దాడుల నిర్వహించారు. కోడి వ్యర్ధాలు అక్రమ రవాణాపై జల్లెడ పడుతున్న  పెదపాడు పోలీస్ యంత్రాంగని బుధవారంపెదపాడు ఎస్ఐ శారదా సతీష్ కి రాబడిన సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించుచుండగా గుడిపాడు,వసంతవాడ వీరమ్మ కుంటా గ్రామాలలో  ఐచార్ ఏపీ 39  టిసి 7465. ఏపీ 39 టిసి 4659, ఏపీ 39 టిసి 7485 వాహనంలలో కోడి వ్యర్థాలు కలిగి ఉన్న లారిని, లారీలో  ఉన్న కోడి వ్యర్ధాలను సీజ్ చేసి  సదరు వాహన డ్రైవర్ మరియు వాహన యజమాని, మరియు చేపల చెరువు యజమానిలాపై  కేసును  నమోదు చేసినట్లు అదేవిధంగా సదరు  కోడి వ్యర్ధాలను ధ్వంసం చేయడం జరుగుతుంది అని పెదపాడు ఎస్ఐ శారద సతీష్  తెలియ చేసినారు.

About Author