NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులు వాడే మ‌ల్చింగ్ పేప‌ర్ వ‌ల్ల కాలుష్యం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వ్యవసాయ భూమిలో ఉన్న తేమను, ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి రైతులు మ‌ల్చింగ్ పేప‌ర్ ను వినియోగిస్తారు. దీనివల్ల భూమిలో ఉన్న తేమ ఆరిపోకుండా ఉంటుంది కాబట్టి అధిక దిగుబడి వస్తుంది. అయితే నేలపై ఇలా ప్లాస్టిక్‌ షీట్లు కప్పి ఉంచడం వలన.. కొన్నిరోజులకు ఆ పట్టాలు పాడై మైక్రోప్లాస్టిక్‌గా మారి వ్యవసాయ భూమి కలుషితం అవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అలాగే వాడేసిన ప్లాస్టిక్‌ పట్టాలను పొలాల చుట్టుపక్కల ప్రాంతాల్లో డంప్‌ చేయడం వల్ల కూడా ఆ పరిసరాలు కాలుష్యం అవుతున్నాయని తేలింది. ఎన్‌జీవో టాక్సిక్స్‌ లింక్‌ అనే సంస్థ కర్ణాటక, మహారాష్ట్రలలో ఇలా ప్లాస్టిక్‌ కవర్లు కప్పి ఉంచి వ్యవసాయం చేస్తున్న భూములలోని మట్టి నమూనాలను పరీక్షించింది. ఈ క్రమంలో వివిధ లోతుల నుంచి సేకరించిన 30 నమూనాలను పరీక్షించగా వాటిలో ప్లాస్టిక్‌ కణాలను పరిశోధకులు కనుగొన్నారు. పొలంలో వాడిన ప్లాస్టిక్‌ షాట్లు పాడై చిన్నచిన్న ముక్కలై భూమిలో కలిసిపోయాయని గుర్తించారు. తద్వారా నేల కలుషితమైందని వెల్లడించారు. కాబట్టి ప్లాస్టిక్‌ షీట్ల వాడకం వలన నేల కలుషితం అయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

                                    

About Author