PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక మాస మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

1 min read

– ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్​ కడప: కడప కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వైయస్సార్ కడప జిల్లా లోనే కాకుండా రాష్ట్రం లోనే ప్రసిద్దగాంచిన శ్రీ శ్రీ శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్తానము ( పోలతల ) కార్తీకమాసం మహోత్సవాల పోస్టర్ ను శుక్రవారం పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి స్వగృహంలో పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, మహా పుణ్య శైవ క్షేత్రం శ్రీశ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ( పొలతల) ను ప్రజలు దర్శించుకుని ఆ దేవదేవుని కటాక్ష సన్నిధిలో పునీతులు కాగలరని ఆయన కోరారు, పొలతల మల్లేశ్వర స్వామిని దర్శించుకుననే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డిలు తెలియజేశారు, అలాగే నవంబర్ 14-11-2022 తేది మూడో సోమవారం ఉదయం 9-30 గంటలకు శివపార్వతుల కళ్యాణమహోత్సవం జరుగుతుందని ఈ కళ్యాణానికి రావాల్సిందిగా ఎమ్మెల్యేను వారు ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో చెన్నూరు సొసైటీ అధ్యక్షులు ముదిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author