ఏపీసెట్ కౌన్సిలింగ్ వాయిదా.. !
1 min read

పల్లెవెలుగు వెబ్: ఏపీసెట్ కౌన్సిలింగ్ వాయిదాపడింది. రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్ 2020 సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా వేసినట్టు ఏపీసెట్ మెంబర్ ఆచార్య కె శ్రీనివాసరావు వెల్లడించారు. ఈనెల 27 నుంచి 29 వరకు జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా వేసినట్టు ఆయన తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది.. త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మొదటి దశ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాని అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల స్కానింగ్ కాపీలను అటెస్ట్ చేసి మెంబర్ సెక్రటరీ apsetau@gmail.com కు మే 10వ తేదిలోపు పంపాలని తెలిపారు.

