అట్టహాసంగా ప్రసాద్ రెడ్డి.. ప్రమాణ స్వీకారం
1 min read
మీ సేవకుడిగా ఎమ్మెల్యే పని చేస్తున్నారు మంత్రి బీసీ
నాయకులు మారినా కార్యకర్తలు పార్టీ వీడరు
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా:మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..
నందికొట్కూరు, న్యూస్ నేడు : నంద్యాల జిల్లా నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. గురువారం సా 6 గంటలకు నందికొట్కూరు మార్కెట్ యార్డులో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. తర్వాత నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వీరం ప్రసాద్ రెడ్డితో సెక్రెటరీ ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా వైస్ ఛైర్మెన్ సుధాకర్ యాదవ్ మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు.తర్వాత జరిగిన సభను ఉద్దేశించి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ నియోజకవర్గంలో మిడుతూర్ ఎత్తిపోతల పథకం మరియు నందికొట్కూరు-పగిడ్యాల రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు.మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి పార్టీని నమ్ముకుని ఉన్నందుకే ఆయనకు చైర్మెన్ పదవి దక్కిందని అన్నారు.తర్వాత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు దౌర్జన్యాలకు గురిచేశారు.పార్టీలో నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీని వీ డరని కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదని అన్నారు. ప్రభుత్వం రైతులను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే జయ సూర్య నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు.జయసూర్య ఎమ్మెల్యేగా కాదు ప్రజలకు సేవకుడిగా పని చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు.నందికొట్కూరు-పగిడ్యాల రోడ్డు మంజూరు చేస్తానని అన్నారు.నూతన చైర్మన్ ప్రసాద్ రెడ్డి ని మరియు డైరెక్టర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.ప్రసాద్ రెడ్డిని నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మాండ సురేంద్రనాథ్ రెడ్డి,జనసేన సంపత్,జనసేన నందికొట్కూరు ఇన్చార్జి రవికుమార్,బిజెపి దామోదర్ రెడ్డి,వెంకటేశ్వర్లు యాదవ్,జాకీర్ హుస్సేన్, రమేష్ రెడ్డి,మొల్ల రబ్బానీ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
