ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి .శాంతికళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గార్గేయపురం ను సందర్శించి రికార్డ్స్ మరియు రిపోర్ట్స్ ను పరిశీలించారు, టీకాలు నిల్వవుంచు యంత్రాలను , కాన్పుల గదిని , ల్యాబ్, మందుల గధిని మరియు వార్డ్ ను తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు మరియు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన ఆరోగ్య సేవలు అందించాలని, ఆ వివరాలను సంబందిత రిజిస్టర్ మరియు పోర్టల్ నందు నమోదు చేయాలని తెలిపారు. పాము కాటు మరియు కుక్క కాటు కు సంబందించిన మందులను పరిశీలించారు. సాదారణ కాన్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రములోనే నిర్వహించాలని ఒక వేల ఏదేని ప్రమాకర లక్షణాలు ఉన్నటైతే త్వరితంగా జిల్లా సర్వజన ఆసుపత్రికి రెఫెర్ చేయాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రము యెక్క పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో డీఈఎంఓ శ్రీనివాసులుశెట్టి, ఆరోగ్య విద్యా భోదకురాలు పద్మావతి , స్టాఫ్ నర్స్ నిర్మలా రాణి పాల్గొన్నారు.