పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. జేఏసీ
1 min readపల్లెవెలుగు, వెబ్ విజయవాడ:రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని వెంటనే వాటిని పరిష్కరించవలసిన అవసరం ఉందని జిల్లా జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ తెలిపారు.స్థానిక గాంధీ నగర్ లోని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు మరియు జేఏసీ చైర్మన్ A. విద్యాసాగర్ మాట్లాడుతూ పెన్షనర్లకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, పెండింగ్ లో ఉన్న ఐదు డిఏ ఏరియర్స్ చెల్లింపులు, పిఆర్సి బకాయిల చెల్లింపు, రెండు విడుదల చేయవలసిన డిఎ లకు ఉత్తర్వులు తదితర అంశాలన్నీ అపరిస్కృతంగా ఉన్నాయని రాష్ట్ర నాయకత్వం ద్వారా ఈ విషయాలన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నామని తెలిపారు. ఎప్పుడూ లేనివిధంగా పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ ఉండటం లేదని వృద్ధాప్యంలో ఉండి పెన్షన్ మీద ఆధారపడే పెన్షనర్లకు ఒకటవ తారీఖున పెన్షన్ పడేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పెన్షనర్లకు సంబంధించిన ఏ సమస్యలైనా జిల్లా జేఏసీ దృష్టికి తీసుకురావాలని వాటన్నిటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తామని పెన్షనర్స్ సంగం పెన్షనర్లకు సంబంధించిన బాగోగులు మరియు వైద్య సేవలు తదితర అంశాల మీద దృష్టి సారించడం సంతోషకరమైన విషయమని పెన్షనర్లు అందరూ ఎప్పుడు లాగానే జేఏసీ మరియు ఎన్జీవో సంఘం ఇచ్చే ప్రతి పిలుపుకు స్పందించాలని ఐకమత్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘం గత 40 సంవత్సరాలుగా అనేక డిమాండ్లు సాధించుకుందని పెన్షనర్లు పెండింగ్ లో ఉన్న డిమాండ్ల విషయమై ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, పెన్షన్ తప్పితే వేరే ఆర్థిక మార్గాలు లేని పెన్షనర్లు మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి వారి సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. వైద్య సేవలకు సంబంధించి ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా మరింత మందికి వైద్య సేవలు అందించేలా సంఘం కృషి చేస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్లు ఎన్జీవో అసోసియేషన్ మరియు జేఏసీ కి బాసటగా నిలుస్తామని వారు ఇచ్చే కార్యాచరణను తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. జిల్లా పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు శ్రీ దాల్ నాయుడు గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్ రావు, సలహాదారు జి నారాయణరావు, పెన్షనర్స్ నాయకులు బిసి మహానంది నాగేశ్వరరావు, రవీంద్ర మరియు ఎన్జీవో నాయకులు విశ్వనాథ్, Ch V ప్రసాద్ పాల్గొన్నారు.