మనవరాలికి జన్మనిచ్చిన నాయనమ్మ
1 min readపల్లెవెలుగువెబ్: అమెరికాలో సరోగసీ విధానంలో కొత్త కోణం వెలుగుచూసింది. 56 ఏళ్ల మహిళ తన కొడుకు-కోడలు బిడ్డను 9 నెలలు గర్భంలో మోసి జన్మనిచ్చింది. వివరాల్లోకెళితే… అమెరికాలోని ఉటా ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్, కేంబ్రియా భార్యాభర్తలు. జెఫ్ హాక్ ఓ వెబ్ డెవలపర్. జెఫ్-కేంబ్రియా దంపతులకు అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా, కొన్ని సమస్యల వల్ల కేంబ్రియాకు గర్భసంచిని వైద్యులు తొలగించారు. దాంతో మరో బిడ్డను కనాలన్న ఆ దంపతులు సరోగసీ వైపు మొగ్గుచూపారు. అందుకు జెఫ్ హాక్ తల్లి నాన్సీ హాక్ ముందుకు రావడం విశేషం.