నూనె గింజల పంటల ఉత్పత్తి గణనీయంగా పెంచాలి…
1 min read
జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య…
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలో నూనె గింజల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబిల్ ఆయిల్స్- (ఆయిల్ సీడ్స్ ) కన్వర్జేన్స్ సమావేశము లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ తన చాంబర్ లో నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ కన్వర్జేషన్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు రైతుల సంక్షేమ విభాగం ద్వారా ” క్రిశోన్నతి ” పథకం క్రింద నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్ సీడ్ ను కొత్తగా ఏర్పాటు చేసి , దీని ద్వారా జిల్లాలో 5 సంవత్సరాల కాలం లో నూనె గింజల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి తీసుకోవలసిన చర్యలు , మార్గదర్శకాలను సూచిస్తున్నదని తెలిపారు. నూనె గింజల ఉత్పత్తి కొరకు 500 హెక్టార్ల భూమి ఖరీఫ్ కొరకు మరియు 500 హెక్టార్లు రబి సీజన్ లకు కేటాయించాలని కోరారు. వీలైనంతవరకు సాగులో లేని భూములను గుర్తించి ఆ భూములను సాగులోనికి తీసుకుని వచ్చి అందులో నూనె గింజల సాగు జరిపే చర్యలు తీసుకోవాలని తెలిపారు.200 మంది రైతుల భూముల ను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసుకొని వారిని ప్రోత్సహించి వారికి ఈ నూనె గింజల సాగువలన ఎక్కువ ఆదాయం వస్తుందని తెలియజేస్తూ వారిని చైతన్యపరిచి నూనె గింజల సాగు పెంచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు జిల్లా వ్యవసాయ అధికారిని వరలక్ష్మి మాట్లాడుతూ…” డిస్టిక్ ఆయిల్ సీడ్ మిషన్ కమిటీ ,” కి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉంటారని, సహకార శాఖ ,వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, ఆత్మ, బ్యాంక్ మరియు ఎఫ్.పి. ఓ లు మెంబర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. అలాగే ” డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ” కి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తూ వ్యవసాయ, ఆత్మ, ఆర్థిక శాఖ అధికారులు మెంబర్లుగా వ్యవహరిస్తారని తెలియజేశారు. ఈ రెండు కమిటీలు రైతులకు అవసరమైన అన్ని సేవలు అందజేస్తారని తెలియజేశారు.ఈ సమావేశానికి జిల్లా అగ్రికల్చర్ అధికారి లలితా వరలక్ష్మి, కోఆపరేటివ్ అధికారి రామాంజనేయులు ,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామచంద్ర రావు , ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు, డిఎం సీడ్స్ ధనలక్ష్మి, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ రత్న ప్రసాద్ , ఎస్ ఈ ఇరిగేషన్ ద్వారక నాథ్ రెడ్డి, బనవాసి కెవికె ప్రిన్సిపాల్ రాఘవేంద్ర చౌదరి, ఎఫ్ పి ఓ లు ఎమ్మిగనూరు, గోనెగండ్ల, పత్తికొండ సంబంధితులు పాల్గొన్నారు.
