PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తాతినేని రామారావు క‌న్నుమూత

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు మృతి చెందారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్ర‌మంలో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో తాతినేని రామారావు జన్మించారు. హిందీ, తెలుగు భాషల్లో దాదాపుగా 80 చిత్రాలకి దర్శకత్వం వహించారు. 1966 లో నవరాత్రి చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన .. ఎన్టీఆర్ రామారావుతో యమగోల, రాజేంద్రప్రసాద్‌తో గోల్ మాల్ గోవిందం, సూపర్ స్టార్ కృష్ణతో అగ్ని కెరటాలు వంటి సూపర్ హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించారు.

                                 

About Author