జిల్లాపరిషత్ లో పదోన్నతులు..
1 min read
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేతుల మీదుగా ఉత్తర్వులు
ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ నిబద్ధతతో పనిచేయాలి
చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిధిలో అర్హత కలిగిన ఉద్యోగులకు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ వారి చేతులమీదుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు అందజేసియున్నారు.ఈ కార్యక్రమంలో 2 సీనియర్ అసిస్టెంట్లుకు (ఏవో) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ప్రమోషన్ పొందారు. ఈ సందర్బంగా జడ్‌పి ఛైర్‌పర్సన్ పదోన్నతి పొందిన అభ్యర్థులను హృదయపూర్వకంగా అభినందించి, ప్రజలకు అత్యంత నిబద్ధతతో, ధర్మబద్ధతతో సేవలు అందించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి తన బాధ్యతను గౌరవంగా చేపట్టడం ద్వారా ప్రజా సంక్షేమాన్ని పెంపొందించగలిగే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల్లో వారు తమ విశేషమైన పాత్రను పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన అధికారులు తమ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ, ప్రజలకు ఉత్తమ సేవలను అందించేందుకు అన్ని విధాలుగా శ్రద్ధ వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ యం శ్రీహరి, పదోన్నతులు పొందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.