వడ్డేర్లకు రక్షణ కరువు…
1 min read– వడ్డే భవ్య శ్రీ కి న్యాయం చేయాలి.
– వడ్డేర్ల సేవా సమితి గలం
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం స్థానిక హొళగుందలో వడ్డెర సేవాసమితి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా,పెనుమూరు మండలం,వేణుగోపాలపురం గ్రామానికి చెందిన మైనర్ బాలిక వడ్డే భవ్య శ్రీ మృతికి న్యాయం చేయాలని చేపట్టిన శాంతి ర్యాలీ హొలగుంద మండల వడ్డెర సేవాసమితి నిర్వహించింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ వడ్డెర సాధికార సమితి కన్వీనర్ వడ్డే వెంకట్,వడ్డెర సేవ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, TNSF రాష్ట్ర కార్యదర్శి వడ్డే పెద్దయ్య హాజరయ్యారు.అనంతరం వారుమాట్లాడుతూ మైనర్ బాలిక వడ్డే భవ్యశ్రీ హత్య జరిగి 15 రోజులు అవుతున్న అధికార ప్రభుత్వం నిందితులను గుర్తించి ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని బీసీ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేస్తే మహిళా కమిషన్ చైర్మన్ స్పందించడం లేదని, హోం శాఖ మంత్రి గా ఒక మహిళ ఉండి కూడా ఆ కుటుంబానికి న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని వీరు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని తెలిపారు. వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా వడ్డెరలపై దాడులు,దౌర్జన్యాలు పెరిగిపోయాయని వడ్డెర ఆడ బిడ్డలను అత్యాచారం చేసి హత్యలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి పాలనలో వడ్డెరలకు రక్షణ లేదని తెలిపారు.ఈ సందర్బంగా వడ్డెర బిడ్డ భవ్య శ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించి హత్య చేసిన దుర్మార్గులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి వడ్డెర బిడ్డ భవ్యశ్రీ కి న్యాయం చేయాలని చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దిగివచ్చే వరకు నిరసన కార్యక్రమాలకు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సేవ సమితి జిల్లా కార్యదర్శి రామకృష్ణ, మండల అధ్యక్షుడు ఎర్రి స్వామి, ఉపాధ్యక్షుడు మరప్ప, కార్యదర్శి విశ్వనాథ్ రాజ్,వడ్డెర సేవ సమితి సభ్యులు హనుమంతు,లక్ష్మి స్వామి, కళప్ప, శేకన్న, సురేష్, శీనప్ప,నాగేంద్ర,వెంకటేష్, పాండు, రాము, వీరంజినేలు,పాపారాయుడు వడ్డెర సేవ సమితి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.