సర్వీస్ ఇనాం భూముల విషయంలో రైతులకు విముక్తి కల్పించండి
1 min read
కూటమి ప్రభూత్వానికి పీపీఎస్,ఆర్వీపీఎస్ విజ్ఞప్తి.
కర్నూలు, న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో పూర్వం కులావృతుల పేరుతో భూములు రైతులకు కేటాయించారు సాగులో కొన్ని ఏళ్ల నుండి పొలం సాగులోఉన్నారు, పట్టాదారు పాస్ బుక్కులు వున్నప్పటికి,బ్యాంకు రుణాలు తీసుకోని రైతులు సాగు చేస్తున్నారు.ప్రస్తుతం ఇనాం భూములు పేరుతో ఎంట్రీ చేయడం వలన రైతులు,రుణాలు రాక, అప్పులు చేసుకొని ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కె.బలరాం, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ అన్నారు నేడు కర్నూలు నగరంలోని స్థానిక ప్రజా పరిరక్షణ సమితి కార్యాలయం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్యం వెంటనే ఇనాం భూములను తొలగించి, రైతుల పేర్లు ఎంట్రీ చేయాలనీ,అన్ని జిల్లాలో,మండల తాసిల్దార్ వారు, ఇనాం లేని భూములను, ఉన్నట్లు తంబు వేసి మార్చున్నారని వారి అవినీతికి అంతు లేకుండా పోతోందని తాసిల్దార్ కార్యలయం లో అవినీతి కంపులో కురుకపోయినదని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలంలో తహసీల్దార్ ఆఫీసులపై ఏసీబీ దాడులు జరిపించి, రైతులను ఆదుకోవాలి అని ప్రజా పరిరక్షణ సమితి, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు.వెంటనే రైతులను వేధించే మండల తహసీల్దార్లపై ఏసీబీ దాడులు జరిపించి తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. నందికొట్కూరు తాలూకా మీడుతూర్ మండల కార్యాలయం,జలకనూరు గ్రామం లోని ప్రభుత్వ భూములకు పట్టాలు ఇస్తాం అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు,వీటిపై విజిలెన్స్ ఏక్వయిరీ వేసి,తప్పుడు ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా పరిరక్షణ సమితి, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా పరిరక్షణ సమితి నాయకులు, చాపే కృష్ణ,నాగార్జున తదితరులు పాల్గొన్నారు.