వికాసిత్ భారత్ సంకల్పయాత్ర పథకాలపై ప్రజలకు అవగాహన
1 min read
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పెదవేగి మండలం బి. సింగారం, అంకన్న గూడెం గ్రామాలలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వివిధ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి ఆర్ మనోజ్ , విస్తరణ అధికారి శ్రీనివాస్ , డాక్టర్ ప్రత్యూష , బిజెపి జిల్లా సిహెచ్ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.