NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్వర‌లో సీఎం మార్పు..

1 min read
  • ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య..!

ప‌ల్లెవెలుగు వెబ్: ముఖ్యమంత్రి య‌డ్యూరప్ప మార్పు ఖ‌రారైంద‌ని అన్నారు బీజేపీ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్యే బ‌స‌వ‌న‌గౌడ పాటిల్. సూర్యచంద్రులు ఉన్నంత వ‌ర‌కు యడ్యూర‌ప్ప ముఖ్యమంత్రిగా ఉండాలన్న రూల్ ఉందా? అంటూ ప్రశ్నించారు. మే 2 తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుంద‌ని.. ఉత్తర క‌ర్ణాట‌క వ్యక్తికి ముఖ్యమంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంద‌న్నారు. ఎవ‌రి బ‌లం…బ‌ల‌హీన‌త అంద‌రికీ తెలుస‌న్నారు. ఇన్నాళ్లు య‌డ్యూర‌ప్పను ముఖ్యమంత్రిగా కొన‌సాగించ‌డం అదృష్టంగా భావించాల‌ని అన్నారు. బ‌స‌వ‌న‌గౌడ వ్యాఖ్యలు ఇప్పడు క‌ర్ణాట‌క‌లో హాట్ టాపిక్ అయ్యాయి. ఒకవేళ ముఖ్యమంత్రి మార్పుకు అధిష్టానం సిద్దమైతే.. త‌దుప‌రి ముఖ్యమంత్రి ఎవ‌ర‌నే ప్రశ్న మొద‌లైంది.

About Author