ఏపీలో వానలు
1 min readపల్లెవెలుగువెబ్ : బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న వాయవ్య – పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా పరిసరాల్లో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఇప్పటికే విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇది ఏర్పడినట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.