NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజ‌మౌళినే ఇండియా నెం. 1.. పారితోషికం ఎంతంటే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజ‌మౌళి ఈ సినిమాకు భారీగానే పారితోషికం తీసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ దాదాపు రూ. 80 కోట్లకు పైగానే పారితోషికం అందించిందని సమాచారం. ఇండియాలో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళి మాత్రమే కావడం గమనార్హం. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ లాభాల్లో 30 శాతం వాటా కూడా అడిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. రాజమౌళికి మూడు వందల కోట్లకు పైనే రెమ్యునరేషన్‌ రూపంలో వస్తుంది. ఇక ఈ సినిమాల్లో నటించిన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లకు ఒక్కొక్కరికి రూ.45 కోట్లను రెమ్యునరేషన్‌గా అందించినట్లు సమాచారం.

                                         

About Author