PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

థియేట‌ర్లో రామ్ చ‌ర‌ణ్ వైఫ్ ర‌చ్చ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ హీరో రామ్‌చరణ్‌ భార్య ఉపాసన థియేటర్‌కు వెళ్లి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చూసింది. ఈ సంద‌ర్భంగా పేపర్లు చింపుతూ, వాటిని గాల్లోకి ఎగరేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. నాటు నాటు సాంగ్‌కు కేకలు పెడుతున్న ఫ్యాన్స్‌పైనా పేపర్లు చల్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే నెట్టింట ఆర్‌ఆర్‌ఆర్‌కు సౌత్‌ నుంచి నార్త్‌ దాకా అంతటా పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. ఇందులో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

                                

About Author