సింగర్ పై రేప్ కేసు !
1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ బాలీవుడ్ సింగర్, కంపోజర్ రాహుల్ జైన్‌పై ఆత్యాచారం కేసు నమోదైంది. తనపై రాహుల్ అత్యాచారానికి పాల్పడినట్లు 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టైలిస్ట్ ముంబై పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాధిత మహిళ ఆరోపణలతో పోలీసులు రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. రాహుల్ తన పనితనాన్ని ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకి మెసేజ్ చేశాడని, తనని తన పర్సనల్ స్టైలిస్ట్‌గా నియమించుకుంటానని కూడా చెప్పి తనని కలవమన్నాడని ఆమె పోలీసులకు తెలిపింది.

