ఉద్యోగ నియమకాలు చెపట్టి బ్యాంకులో పనిభారం తగ్గించాలి
1 min read
ఈ నెల 24,25 రెండు రోజు దేశావ్యాప్త సమ్మెకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు నిచ్చాయి
కర్నూలు, న్యూస్ నేడు: ఈ సమ్మెకు ముందుస్తు నిరసనగా గతం లో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది.ముందు ప్రకటించిన కార్యాచరణ ప్రకారం ఈరోజు కర్నూలు లో నిరసన కార్యక్రమంలో భాగంగా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బుధవారపేట శాఖ గాయత్రి ఎస్టేట్ దగ్గర సాయంత్రం 5.30గ ల కు ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంనకు UFBU జిల్లా కన్వీనర్ ఇ నాగరాజు అధ్యక్షత వహించారు. బ్యాంకు లోగత 10 సంవత్సరాలనుండి ఏర్పడిన రెండు లక్షల ఉద్యోగ ఖాలీలను తక్షణమే ఉద్యోగనియమకాలు చెపట్టి బ్యాంకులో పనిభారము తగ్గించాలని ,వారానికి 5 రోజుల పనిదినాలు కలిపించాలని, తాత్కాలిక ఉద్యగులను పర్మనెంట్ చేయాలనీ, అవుట్ షోర్సింగ్ ఉద్యోగాలు నిలిపివేయాలని,IBA తో చేసుకున్న ఒప్పంద ప్రకారం మిగిలిన కోరికలను వెంటనే పరిష్కరించాలని, కేంద్రప్రభుత్వ విధానం లాగా గ్రేట్యూటీ 25లక్షలు పెంచి ఇన్కమ్ టాక్స్ రాయితీ ఇవ్వాలని,బ్యాంకు ఉద్యోగులు పై జరుగు తున్న దాడులని బ్యాంకు యాజమాన్యలు మరియు కేంద్రప్రభుత్వము నివారణకు చర్యలు తీసుకొని ఉద్యగులకు భద్రత కల్పించాలని కోరడమైనది లీడర్స్ తెలియదేశారు ఈ కార్యక్రమం లో AIBEA నాయకులు శివకృష్ణ,ఎల్లయ్య,కృష్ణ మోహన్ ,AIBOC నాయకులు మురళి కృష్ణ, NCBE నాయకులు విద్యాసాగర్,ప్రవీణ్, శ్రీకాంత్,ఏపీజీబీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొని ప్రశాంగించారు.
