కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిధిలో11కె.వి స్తంభాల మార్పిడి
1 min read
ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ కు అంతరాయం
వినియోగదారులు సహకరించాలని మనవి
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ కె.యం అంబేద్కర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఈనెల 27వ తేదీన ఏలూరు 1వ పట్టణంలో గల కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిదిలో 11కెవి కెనాల్ ఫీడరులోని స్తంభాల మార్పిడి పనుల నిమిత్తం ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపదల చేయబడునని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆపరేషన్ కె.ఎమ్. అంబేద్కర్ శుక్రవారం తెలిపారు. ఈ సమయంలో కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిధి లో గల పెరుగుచెట్టు, అంబికా థియేటర్, కెనాల్ రోడ్, నవాబ్ పేట, బావిసేట్టివారిపేట, నల్లదిబ్బ మరియు మునిసిపల్ ఆఫీసు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.