NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీపీఎస్సీ ద్వార స‌చివాల‌య ఉద్యోగాల భ‌ర్తీ

1 min read

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

  • గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లపై సచివాలయంలో వేర్వేరుగా సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటినీ ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్‌ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. అయితే.. గ‌తంలో భ‌ర్తీ చేసిన స‌చివాల‌య ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వార కాకుండా .. పంచాయ‌తీ రాజ్ శాఖ ద్వార భ‌ర్తీ చేసి.. ఉద్యోగాల‌కు భ‌ద్రత లేకుండా చేశారని అప్పట్లో టీడీపీ నేత‌లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఏపీపీఎస్సీ ద్వార భ‌ర్తీ చేయాల‌ని ఆలోచ‌న చేసినట్లు ఉంద‌ని ప‌లువురు అభిప్రాయం వ్యక్తంచేశారు.

About Author