PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

24 గంట‌ల్లో రాజీనామా.. లేదంటే అవిశ్వాసం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామాకు ప్ర‌తిప‌క్ష‌ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు మంగళవారం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పరిపాలన అత్యంత దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. పీపీపీ నేత బిలావల్ భుట్టో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనాలని హెచ్చరించారు.

                                               

About Author