ఘనంగా నెణికిలింగేశ్వర పట్లద దేవర
1 min read
సామూహిక వివాహాల్లో ఒక్కటైన 16 జంటలు
పట్లధ దేవుళ్లు కొన్ని దేవుడు
దేవుళ్లను దర్శించుకుంటున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
డోలు కొడ్డూ విన్యాసాలు చేస్తున్న భక్తులు
తరలి వచ్చిన భక్తులు
సామూహిక వివాహాలు జరుగుతున్న దృశ్యం
నూతన జంటలను ఆశిర్వదిస్తున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులను సన్మానిస్తున్న గ్రామస్తులు
డోళ్ల పైకెక్కి డోలు కొడున్న భక్తుడు
హొళగుంద , న్యూస్ నేడు: హొళగుంద మండల పరిధిలోని నెరణికి గ్రామంలో ఆదివారం నెఱికిలింగేశ్వరస్వామి పట్లా దేవర (పట్టాభిషేక) ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామంలో వెలిసిన నెణికిలింగేశ్వర, భీరలింగేశ్వర స్వామితో కలిపి మొత్తం 11 గ్రామాలకు చెందిన ఉత్సవ విగ్రహాలను భక్తులు నెరణికిలో అత్యంత వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆలయంలో అభిషేకాలు, మహామంగళారతి, కుంభోత్సవాలు ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామికి నైవేద్యం సమర్పించారు. దేవుళ్ల సన్నిధానంలో 16 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వచ్చిన భక్తులకు స్థానికులు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. వేడుకలో భాగంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, జగనన్న అభిమానులతో కలిసి నెరణికి గ్రామంలోకి వచ్చిన 11 గ్రామాల పట్టద దేవుళ్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలో నిర్వహించారు.
