NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సబ్ ఇన్స్పెక్టర్ ఏలూరు జిల్లా పోలీసు పిఆర్ఓ కేశవరావు పదవీ విరమణ

1 min read

14 సంవత్సరాలు నిబద్ధతతో సేవలు

అధికారులతో పాత్రికేయులతో, ప్రజలతో మమేకమైన తీరు ఎప్పటికీ ఆదర్శం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా పోలీసుశాఖలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా 14 సంవత్సరాలు నిబద్ధతతో సేవలందించి,సోమవారం పదవీ విరమణ చేస్తున్న శ్రీ కేశవరావు కి పోలీస్ శాఖ శుభాకాంక్షలుతెలిపారు. మీ అనుభవం నిజాయితీ, అధికారులతో పాత్రికేయులతో, ప్రజలతో మమేకమైన తీరు ఎప్పటికీ ఆదర్శమన్నరు.పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి,పీఆర్ఓ గా సమర్థవతoగా అద్భుత సేవలందించరన్నరు.క్రమశిక్షణ, కర్తవ్యనిష్ఠకు మారుపేరుగా నిలిచి, ఏలూరు జిల్లా పోలీసు శాఖ కీర్తిని ఇనుమడింపజేసిన మీరు మీ విశ్రాంత జీవితం సుఖసంతోషాలతో గడవాలని ఆశిస్తున్నామన్నరు.కేశవరావు పోలీసు యూనిఫామ్‌కు వీడ్కోలు పలికినా, మీరు చేసిన మంచి పనులు ఎప్పటికీ మా గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటాయన్నరు. మీ మాటల్లోని సౌమ్యత, చేతల్లోని నిజాయితీ ఏలూరు పోలీసు శాఖకు ఎనలేని గౌరవం తెచ్చాయి మీరు సబ్ ఇన్స్పెక్టర్ గా పదవీ విరమణ చేసిన, ఏలూరు జిల్లా పోలీసు జిల్లా పిఆర్ఓ గా మీ సేవలు పోలీసులు శాఖకు, ప్రజలకు అందించాలని ఆకాంక్షిస్తున్నమన్నరు.

About Author