NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా రెవరెండ్ ఫాదర్ డాక్టర్: పి.బాల జన్మదిన వేడుకలు

1 min read

పెద్ద ఎత్తున తరలివచ్చిన ఫాదర్లు, సిస్టర్లు,మేత్రాసాయనగురువులు, జిల్లా అధికారులు

నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్సులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మేత్రాసన వికారి జనరల్ మరియు ప్రస్తుత సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ రెవరెండ్ డాక్టర్:ఫాదర్ పి.బాల జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగాఏలూరు సెయింట్ జోన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆవరణలో  పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఏలూరు మేత్రాసనం నుండి పెద్ద ఎత్తున  ఫాదర్లు, సిస్టర్లు పాల్గొని పూలదండలు అందించి శాలువాలు కప్పి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా దైవాశీస్సులు ఉండాలని తమ ఆశీస్సులు అందించారు. ఈ జన్మదినం వేడుకలకు డిఆర్డిఏ పిడి డాక్టర్:ఆర్.విజయరాజు, మైనారిటీ ఏడి, కళాశాల అధ్యాపకులు,అధ్యాపకేయులు, సిబ్బంది,విద్యార్థినీ,విద్యార్థులు  ఉపదేశకులు  స్థానిక పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ వేడుకను అత్యంత వైభవంగా విజయవంతం చేశారు.

About Author