PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోరింగ్‌ సాంగ్‌..పాట కోసం 3 కోట్లు..

1 min read

సినిమా డెస్క్​ : టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ సినిమా మేకింగ్‌ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు. సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో స్పెషల్ సెట్ వేశారు. సాంగ్ షూట్‌లో హీరోలు చరణ్, ఎన్టీఆర్ తో ఆలియా భట్‌ ఆడి పాడనుంది. ఈరోజు నుంచి వారం రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరగనుందని, వెయ్యి మంది బ్యాగ్రౌండ్ డ్యాన్సర్స్ తో సాంగ్ డిజైన్ చేస్తున్నారని సమాచారం. దీంతో సినిమాపై అంచనాలు మరో లెవల్‌కి చేరుకున్నాయి. మరో విశేషమేమిటంటే ఈ పాటలో మరికొందరు హీరోలు కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. ప్యాన్ ఇండియాగా డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.


About Author