NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కడపలో ‘రాయల్ఓక్ ’ ఫర్నీచర్ ఆవిష్కరణ

1 min read

కడప, న్యూస్​ నేడు : స్థానిక బిల్టప్  సర్కిల్, మరియపురం, కడప వద్ద సుమారు 19,000 చదరపు అడుగుల విస్తీర్ణం లో అద్భుతమైన భారతదేశంలోని ప్రముఖ బ్రాండు రాయల్ఓక్ ఫర్నీచర్ స్టోర్ ఈరోజు ప్రారంభించారు. ఈ స్టోర్ ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయల్ఓక్ బ్రాండు ఉనికిని బలోపేతం చేసినది. అంతేకాక కడప పరిసర ప్రాంత ప్రజలకు వారి ఫర్నీచర్ అవసరాలకు చక్కని పరిష్కారాలను సూచిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక స్టోర్ ఆవిష్కరణ కార్యక్రమంనకు  రాయల్ఓక్ ఇన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ విజయ్ సుబ్రహ్మణ్యం మరియు మేనేజింగ్ డైరక్టర్ శ్రీ మదన్ సుబ్రహ్మణ్యం హాజరైనారు. ఇంకనూ శ్రీ కిరణ్ చబారియా, రాయల్ఓక్ ఫ్రాంచైజ్ హెడ్, శ్రీ తమ్మయ్య కొటేరా, రాయల్ఓక్ VM & NSO, శ్రీ KP.వినోద్, ఆంధ్ర & తెలంగాణా రాయల్ఓక్ హెడ్, మరియు ఫ్రాంచైజీ యజమానులు శ్రీ నాని & శ్రీమతి మోనికా ఈ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. ఈ సువిశాలమైన రాయల్ఓక్ బ్రాండు స్టోర్ నందు ఇంటిని అందంగా మరియు విలాసవంతంగా గొప్పగా ప్రతిబింబించు విధంగా ఇంటికి మరియు ఆఫీసుకు అవసరమైన అన్ని రకాల లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్ రూమ్ , కిచెన్ రూమ్, వెలుపల వేసుకునే ఫర్నీచర్, ఆఫీసు ఫర్నీచర్ మొదలైనవి ఇప్పుడు కడప పరిసర ప్రాంతాల వారికి ఆకర్షనీయమైన ధరలలో లభిస్తాయి. వారి ఫర్నీచర్ కలలను సాకారం చేస్తుంది.  రాయల్ఓక్ ఫర్నీచర్ చైర్మన్ శ్రీ విజయ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మా ఫ్రాంచైజ్ పార్టనర్ శ్రీ నాని గారితో కలసి ఆంధ్రప్రదేశ్ లోని కడపలో మరో అద్భుతమైన స్టోర్ ప్రారంభించటం ఎంతో గర్వంగా ఉంది. నాని గారి మా అభినందలు తెలియచేస్తున్నాను అన్నారు. దేశ వ్యాప్తంగా మా బ్రాండు స్టోర్స్ విస్తరించు ప్రణాళికలో భాగంగానే ఈ కడప స్టోర్ ప్రారంభించామని ఇది ఈ ప్రాంతా విలువైన ఖాతాదారుల అన్ని రకాల ఫర్నిచర్ అవసరాలను తీరుస్తుందని విశ్వసిస్తున్నాము అన్నారు. రాయల్ఓక్ ఎల్లప్పుడూ నాణ్యమైన ఉత్తమ ఫర్నీచర్ అందించుటలో ముందు నిలుస్తుంది అన్నారు.   ఈ రాయల్ఓక్ స్టోర్ ను అందంగా రూపుదిద్దటమే కాక ఇక్కడ కంట్రీ కలెక్షన్ ఫర్నీచర్ తోపాటు అమెరికా, ఇటలీ, మలేషియా వంటి దేశాలను తెచ్చిన  అత్యున్నత నాణ్యమైన ఫర్నీచర్ రకాలను అందుబాటులో ఉంచారు.గృహ సౌందర్యాన్ని పొందికగా అమర్చిన ఫర్నీచర్ తోటి మరింత ఆధునికంగా మరియు విలాసవంతంగా చూపటమే రాయల్ఓక్ ఫర్నీచర్ ప్రత్యేకత.  రాయల్ ఓక్ లక్షలాది ఖాతాదారుల జీవన శైలి ఫర్నీచర్ అవసరాలను తీరుస్తున్నాది. రాయల్ఓక్ కాశీరు నుండి కన్యాకుమారి వరకు మరియు గుజరాత్ నుండి నాగాలాండ్ వరకు అన్ని మెట్రో, టైర్-2 & టైర్-3 నగరాలలో విస్తరించి ఉన్నది. సుమారు 200 పైగా స్టోర్స్ కలిగి ఉన్నది. వివరాలకు సంప్రదించండి  88862 88885/86

About Author