PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తారక్‌ చేతిలోకి ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ ఇన్‌స్టా

1 min read

సినిమా డెస్క్​ : సెన్సేషనల్‌ డైరెక్టర్‌‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా, కోమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఒలివియా మోరిస్, అలియా భట్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్ సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పలు అప్డేట్స్ ను సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ మూవీ అకౌంట్ ద్వారా వెల్లడించడం జరుగుతోంది.
తారక్‌ ఈ చిత్రం లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉక్రెయిన్ లో షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను జూనియర్ ఎన్టీఆర్ ఆగస్ట్ 9 వ తేదీ నుండి స్వాధీనం చేసుకోనున్నారు. అందుకు సంబంధించిన విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఇప్పటికే పలు అప్డేట్స్ ను ఇస్తూ అభిమానులను అలరిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అకౌంట్ ఎన్టీఆర్ చేతిలోకి రావడంతో, ఎన్టీఆర్ ఇన్‌స్టాలో రివీల్‌ చేసే అప్‌డేట్స్‌ కోసం అభిమానుల వెయిటింగ్‌ షురూ అయ్యింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

About Author