PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్.. ఆల్ ఇండియా రికార్డు సొంతం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి రోజు నుంచీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని.. వరుసగా రికార్డుల్ని బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. సినిమా విడుదలై ఇప్పటి తొమ్మిది రోజులైనప్పటికీ.. కలెక్షన్స్ లో దూకుడును ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి రికార్డ్ స్థాయిలో రూ. 800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తోంది. మరికొద్ది రోజుల పాటు ఇదే స్థాయిలో కలెక్షన్స్ కొనసాగితే.. రూ. 1000 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

                                      

About Author