ఆర్ఆర్ఆర్ సవాల్.. దమ్ములేని సీఎంగా ఒప్పుకోవాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఫిబ్రవరి 5లోగా తనను ఎంపీగా డిస్ క్వాలిఫై చేయించాలన్నారు. లేదంటే దమ్ములేని సీఎంగా ఒప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మోదీ, అమిత్‌షా, స్పీకర్‌కు ఎవరికైనా తనపై ఫిర్యాదు చేసుకోవాలన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముందని, సచివాలయ ఉద్యోగులకు మద్దతు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి.. ప్రజల కష్టాలు చూడాలన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండానే ఆరోగ్యశ్రీ తొలగించారని విమర్శించారు.