NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. భారీ తారాగణం, టెక్నికల్‌ వాల్యూస్‌తో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాస్తూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఒక్క నైజాం ఏరియాలోనే క‌లెక్ష‌న్స్ ప‌రంగా స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో తొలి రోజున రూ.23.35 కోట్లు వసూలు చేసింది. తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో సుమారు 120.19కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అలాగేఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఓవర్సీస్‌ కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 257.15 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా పవర్‌ మరోసారి చూపించింది.

                                           

About Author